NTPC Recruitment 2020 for 70 Diploma Engineer Posts, Apply Online @ntpccareers.net
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ 70 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జార్ఖండ్, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ లాంటి విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఇంజనీరింగ్‌లో డిప్లొమా పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://ntpccareers.net/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు- 70
◆ మైనింగ్- 40
◆ ఎలక్ట్రికల్- 12
◆ మెకానికల్- 10
◆ మైన్ సర్వే- 8
ఎన్‌టీపీసీలో 70 జాబ్స్... రూ.24,000 వేతనం
ముఖ్య సమాచారం:
విద్యార్హతలు: మైనింగ్ పోస్టుకు డిప్లొమా ఇన్ మైనింగ్ లేదా మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ పోస్టుకు డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మైన్ సర్వే పోస్టుకు డిప్లొమా ఇన్ మైన్ సర్వే లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ కోర్సులను 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 25 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
స్టైపెండ్: ఎంపికైన వారికి నెలకు రూ.24,000 ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 23, 2020
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 12, 2020
వెబ్‌సైట్: https://ntpccareers.net/
నోటిఫికేషన్:
Notification-NTPC-Ltd-Diploma-Engineer-Posts
0 Comments:
Post a Comment