Monday, 12 May 2025

పాపలను కడిగే పంబవాసా శరణమంటు వేడేను శబరినివాసా@2024

 *అయప్పస్వామి కై రాసిన భక్తి పదాల అల్లిక* 2024/1



పల్లవి//పాపలను కడిగే పంబవాసా

శరణమంటు వేడేను శబరినివాసా


 కరుణించు కాపాడు కరిమలవాసా. శరణమంటు వేడేను శబరినివాసా


 చరణం 1//

అడుగగాన గండలే అయోమయ పరిస్థితులే


అజ్ఞానముతో చేసిన  పాపలను త్రుంచి అంపదలన్నీ తొలిగించి కాపాడు కరిమలవాసా


పాపలను కడిగే పంబవాసా

శరణమంటు వేడేను శబరినివాసా..... 


చరణం 2

మనస్సునండా మాలవేయలని||2||

కన్నులార మీ రూపాన్ని||2|| చూడాలని 

మాలవేసే దారి చూపు మణికంఠ

మమ్మేలే మహదేవ 


శరణమంటు వేడేను శబరినివాసా

పాపలను కడిగే పంబవాసా


చరణం 3

 మొక్కు కున్న మొక్కలన్ని/ ముడుపులంన్ని ఇరుముడి గా తలపై పెట్టుకుంటా..స్వామి. 


సామి సామి అనుకుంటూ అయ్యప్ప


...స్వామి 

స్వామి శరణం అయ్యప్ప అనుకుంటూ.  ముందుకు సాగుతా..ను. ముక్కంటి పుత్ర

అ ఐదు కొండల అయ్యప్ప 

శబరిమలై యాత్ర కొస్తానే అయ్యప్ప 

__________________

పంబనదీ లో స్నానం మాపాపల (సం)హరణము  కన్యాముల గణపతిని పూజించి  పంబనివాసా పంచగిరి

అయ్యప్పస్వామి కై స్వామి శరణం అయ్యప్ప అనుకుంటూ.  ముందుకు సాగుతా..ను. ముక్కంటి పుత్ర

అ ఐదు కొండల అయ్యప్ప

👍🙏


               *లక్ష్య శ్రీ ఉరడి*

                 9493809120

0 Comments:

Post a Comment

Latest Jobs

More

uradi

Top