పర్యావరణ పరిరక్షణ, అడవుల అభివృద్ధిపై ఉపాధ్యాయులకు,ఉద్యోగులకు IBS లో మూడు రోజుల శిక్షణ
శంకర్పల్లి మండలంలోని దొంతాన్పల్లి లో గల ICFAI LAW SCHOOL వారు , భారత పర్యావరణ శాఖ సూచనల మేరకు మండలంలో గల మున్సిపల్, హెల్త్, ఎడ్యుకేషన్,మరియు రెవెన్యూ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు *ఫారెస్ట్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ పర్సనల్ ఆఫ్ అదర్ సర్వీసెస్ ఆన్ పాలసీ అండ్ లీగల్ ఇష్యూస్ ఇన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్* అనే అంశం పై రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆధునిక కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందుతున్న తరుణంలో పర్యావరణం అదేస్థాయిలో కాలుష్యానికి గురిఅవుతున్నది. మన చుట్టూ ఉన్న పరిసరాలలో నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగి మానవ వినాశనానికి దారితీస్తున్న తరుణంలో మనం పర్యావరణాన్ని పరిరక్షించకపోతే మన తరువాత భవిష్యత్ తరానికి భూమిపైన బ్రతికే అవకాశం లేకుండా పోతోందని ఈ శిక్షణలో తెలపడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి రోజు మేడ్చల్ జిల్లాలో గల జవహర్ నగర్లోని *వ్యర్థాల రీసైక్లింగ్ షేడ్* మొత్తం హైదరాబాద్ జిహెచ్ఎంసి ఏరియా నుండి వస్తున్న చెత్తను సేకరించి తిరిగి రీసైకిలింగ్ చేసి దాని ద్వారా విద్యుత్తు ఉత్పత్తి, ప్లాస్టిక్ వస్తువుల తయారుకు ఉపయోగపడే ప్లాస్టిక్ యూనిన్ నీ క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా సందర్శించడం జరిగింది. రెండవ రోజు సిద్దిపేట జిల్లాలో గల *ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్* నీ సందర్శించి అక్కడ విద్యార్థులు పరిశోధన చేస్తున్నటువంటి వివిధ రకాల చెట్లు, అటవీక ఉత్పత్తుల గురించి తెలుసుకుని, దగ్గర్లో ఉన్నటువంటి CM KCR గారు 2017లో, 2000 ఎకరాలలో, 2 లక్షల మొక్కలు నాటిన *హరితహారం* క్షేత్రాన్ని అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్ అధికారి కిరణ్ కుమార్ సార్ చూపించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ICFAI LAW స్కూల్ డైరెక్టర్ AV నర్సింహా రావు సార్, రిజిస్టర్ Dr విజయలక్ష్మీ మేడం, ప్రొఫెసర్ మూర్తి సార్, ప్రొఫెసర్ హేమలత మేడం, ప్రొఫెసర్ దిలీప్ శర్మ,ప్రొఫెసర్ గీత ప్రియదర్శిని,MEO సయ్యద్ అక్బర్, ఉపాధ్యాయులు ఆశీర్వాదం,రాములు,
తహెర్ అలీ, మర్పల్లి అశోక్, బాలరాజ్, లక్ష్య శ్రీ ఉరడివెంకటేష్ ,కె వెంకటేష్, అచ్చమ్మ, ప్రవళిక, పద్మజ,జంగయ్య, పంచాయతీరాజ్ ఉద్యోగులు ఉమామహేశ్వరి, చరణ్ తేజ్, రెవెన్యూ ఉద్యోగులు వీరకుమార్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది
0 Comments:
Post a Comment